
మంచిర్యాల ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలో శాంతియుతంగా గణేష్ పండగ నిర్వహించుకోవాలని ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేష్ మండలి నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. నిర్వాహకులు వారి వారి మండలి సభ్యులతో చక్కగా నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. రూమర్స్ నమ్మవద్దని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత పోలీస్ శాఖ వారికి తెలియజేయాలన్నారు. విద్యుత్ సౌకర్యం, షెడ్ నిర్మాణంలో నాణ్యత తో పాటు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ తిరుపతి రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ ఐ లు, గణేష్ మండలి నిర్వాహకులు పాల్గొన్నారు.
