Wednesday, August 19, 2026
HomeTelanganaపరీక్షా కేంద్రాలను సందర్శించిన: డిసీపీ

పరీక్షా కేంద్రాలను సందర్శించిన: డిసీపీ

📰 Generate e-Paper Clip

పరీక్షా కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే అధికారులకు సూచనలు చేస్తున్న: ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్

మంచిర్యాల జిల్లా: జిల్లా జిల్లా కేంద్రం లో రేపు ఆదివారం జరిగే పోలీస్ ప్రిలిమినరీ వ్రాత పరీక్ష కేంద్రాలను మంచిర్యాల ఇన్చార్జి డిసీపీ అఖిల్ మహాజన్ సందర్శించి పరిశీలించారు.. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. వ్రాత పరీక్ష జరిగే సమయంలో జిరాక్స్ సెంటర్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసి వేయించాలని ఆదేశాలు జారీ చేశారు.  పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతలు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. వ్రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మినహా వంద మీటర్ల లోపు పరిసరాల్లో ఎవ్వరూ ఉండరాదని, పరీక్షా కేంద్రంలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలని అన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు హాజరు అవుతున్న అభ్యర్థులకు మంచి జరగాలని ఇంచార్జ్ డీసీపీ ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.