Tuesday, August 18, 2026
HomeCrimeరెండ్రోజుల్లో మూడు ఉగ్రదాడులు..!

రెండ్రోజుల్లో మూడు ఉగ్రదాడులు..!

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్: స్వాతంత్య్ర దినోత్సవం నాటి నుంచి కశ్మీర్ లో ఉగ్రమూక మళ్లీ పేట్రేగిపోతోంది. కేవలం 48 గంటల వ్యవధిలో మూడు ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఓ హిందూ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెందగా మరొ ముగ్గురు గాయపడ్డారు. నేడు దక్షిణ కశ్మీర్ లోని జిల్లాలోని ఛోటేగావ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఇద్దరు సోదరులపై కాల్పులు జరిపారు. బాధితులు గ్రామానికి చెందిన సునీల్ కుమార్, పింటూ కుమార్ లుగా గుర్తించారు. వీరిలో సంఘటనా స్థలంలోనే సునీల్ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన పింటును ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన ప్రదేశాన్ని భద్రతా దళాలు అదుపులోకి తీసుకొని ఉగ్రవాదులు కోసం గాలిస్తున్నాయి.

ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ పోలీస్ ట్విటర్ హ్యాండిల్ వెల్లడించారు. 24 గంటల వ్యవధిలో కశ్మీర్ లోయలో మైనార్టీలపై జరిగిన రెండోదాడి ఇది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున బుడ్గావ్ లొనీ గోపాల్ పోరా ఛాడూరా వద్ద ఉగ్రవాదులు గ్రనేడ్ తో దాడి చేశారు. ఈ ఘటనలో కరణ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి గాయపడ్డాడు. అతడిని శ్రీనగర్ లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి అతడి పరిస్థితి నిలకడగా ఉంది. మరోవైపు శ్రీనగర్ లోనీ పోలీస్ కంట్రోల్ రూమ్ పై కూడా ఉగ్రవాదులు గ్రనేడ్ తో దాడి చేశారు. ఈ ఘటనలో పోలీస్ సిబ్బంది ఒకరు గాయపడ్డారు. అతడిని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.