Sunday, August 16, 2026
HomeTelanganaకానిస్టేబుల్ సస్పెన్షన్..?

కానిస్టేబుల్ సస్పెన్షన్..?

📰 Generate e-Paper Clip

ఉత్తర్వులు జారీ చేసిన రామగుండం సీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి

రామగుండం పోలీస్ కమిషనరేట్: పెద్దపల్లి జోన్ పరిది రామగుండము పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్–3500, ఏం.ఏ. వసీం అక్రమ్ ను సస్పెండ్ చేస్తూ రామగుండము పోలీస్ కమిషనర్ ఎస్.చంద్ర శేఖర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.. కానిస్టేబుల్ ఏం.ఏ. వసీం అక్రమ్ తప్పుడు సమాచారం ఇచ్చి దీర్ఘకాలికల సెలవులో ఉండి స్టార్ ఫౌండేషన్ కోచింగ్ సెంటర్, కరీంనగర్ లో డిఫెన్స్/పోలీస్ కోచింగ్ సెంటర్ నిర్వహణ  నిబంధనలకు విరుద్ధంగా గత కొంతకాలం నుండి నిర్వస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఇతర ప్రైవేటు (వ్యాపార)కార్యకలాపాలలో పాల్గొన్నందుకు ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగినది.

ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తూ ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదు అని రామగుండము  పోలీస్ కమిషనర్ ఎస్.చంద్ర శేఖర్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.