
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల జిల్లా: ఓటు విలువ, ఆవశ్యకతను వివరిస్తూ ఓటరు చైతన్య కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమి, ఎన్నికల విభాగం అధికారులతో కలిసి గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరు తమ వివరాలను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని తెలిపారు. 18 సం॥లు నిండిన వారు నూతన ఓటరుగా నమోదు కొరకు ఫారం-6ను వినియోగించాలని, ఎపిక్ లో ఇంటి చిరునామా, ఓటరు జాబితాలో మార్పులు, వివరాల నవరణలు, దివ్యాంగులుగా గుర్తింపు కొరకు ఫారం-8ను వినియోగించాలని తెలిపారు. నకిలీ ఓటర్ల నిర్మూలనకు ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడంలో అందరు తమ వంతు బాధ్యత నిర్వహించాలని, ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధానం కొరకు ఫారం – 6బి ఉ పయోగించాలని తెలిపారు. వివరాల నమోదు, సవరణలు, మార్పుల కొరకు బూత్ స్థాయి అధికారులు, సహాయ ఎన్నికల అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్లు, ఎన్నికల డి.టి. శ్రీనివాన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


