
డీసీపీ ఆదేశాలు కూడా లెక్కచేయని దుకాణదారులు
యదేచ్చగా పసిడి స్కీంలు నడుపుతున్న జ్యువెల్లరీ యజమానులు
తక్షణం ఈ పసిడి లక్కీ స్కీంల వ్యవహారంపై తగు చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా కేంద్రంలో యదేచ్ఛగా కొనసాగుతున్న బంగారం లక్కీ స్కీంల దందా, గతంలో జ్యువెల్లరీ షాపుల్లో లక్కీ స్కీం ల నిర్వహణ పై డిసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి స్పందించి జిల్లా వ్యాప్తంగా జ్యువెల్లరీ షాపుల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి, జ్యువెలరీ షాపుల్లో స్కీంల నిర్వహణ చట్ట విరుద్దమని తెలియజేస్తూ, తక్షణమే స్కీంలు ఆపేసి స్కీంలలో చేరిన ప్రతీ సభ్యునికి వారు ఇప్పటి వరకు కట్టిన డబ్బును తక్షణం చెల్లించాలని ఆదేశించారు. జువెల్లరీ షాపుల యూనియన్ డీసీపీ ఆదేశాలకు అనుగుణంగా స్కీంలను రద్దు చేస్తామని లిఖిత పూర్వకంగా అందజేసినప్పటికి, చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడం లేదు. గతంలో మన పొరుగు రాష్ట్రాలు డ్రా స్కీంల పేరిట కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పివేసాయన్న విషయం అందరికీ తెలిసిందే. పసిడి ధరలు పెరుగుతుండడంతో ఇలాంటి స్కీంల ఆశ చూపుతూ ప్రజల దృష్టిని స్కీంల వైపు మరల్చి మోసపుచ్చుతున్నారు. తక్షణం ఈ పసిడి లక్కీ స్కీంల వ్యవహారంపై సంబంధిత ప్రభుత్వ అధికారులు, స్పందించి చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.


