Telugu Updates
Logo
mobile after logo

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్‌ దగ్గర గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది.. ఈ ఘటన మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం 7:00 గంటల సమయంలో చోటుచేసుకుంది.. మంచిర్యాల టౌన్ సిఐ ప్రమోద్ వెల్లడించిన వివరాల ప్రకారం, సుమారు 40–45 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని మగవ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందడంతో పోలీసు బృందం వెంటనే అక్కడికి చేరుకుంది. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మృతుడు గులాబీ రంగు జెర్కిన్, డబ్బాల చొక్కా, కాఫీ రంగు పాయింటు ధరించి ఉన్నాడని అతని ప్యాంటు జేబులో కాగజ్నగర్ నుండి మంచిర్యాలకు ప్రయాణించే బస్ టికెట్ మరియు బైక్ తాళం ఉందని తెలిపారు. స్థానికులలో ఎవరికైనా మృతుడు పరిచయం ఉన్నా, లేదా ఏదైనా మిస్సింగ్ కేసుతో ఈ వ్యక్తి ఫోటో సరిపోతే, ఆ సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఇందుకోసం ప్రత్యేకంగా 8712656 534 నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు సిఐ ప్రమోద్ తెలిపారు. మృతుడి గుర్తింపును, మరణ కారణాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు..

Post bottom