యాదాద్రి : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యాదాద్రి క్షేత్రానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత తదితరులు గవర్నర్ కు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. యాదాద్రి ప్రధానాలయాన్ని సందర్శించారు. స్వయంభు మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు..


