వివాదాస్పదమవుతున్న సింగరేణి అధికారులు తీరు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తాండూర్ మండలం మాదారం గ్రామపంచాయతీలో సింగరేణి స్థలంలో వివాదాస్పదమైన కట్టడాన్ని ఎట్టకేలకు సింగరేణి అధికారులు తొలగించడానికి వచ్చారు. గ్రామపంచాయతీ అవసరాల కోసం స్టోర్ రూమ్ గా నిర్మాణం చేస్తున్నామని చెప్పి నిర్మించిన నాలుగు గుంటల స్థలంలో మాదారం సర్పంచ్ భర్త అయిన మంగీలాల్ తన సొంతం చేసుకోవడానికి చూస్తున్నారని తెలిసి వారం రోజుల క్రితం ఈ కట్టడంపై గ్రామపంచాయతీ వార్డు సభ్యులైన కుశనపల్లి లక్ష్మణ్, పాముల పద్మ, పాండ్రాల భాగ్య, గొల్లపల్లి బానేష్ ,గోదల లక్ష్మి పంచాయతీ అధికారికి, సంబంధిత సింగరేణి అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది పూర్తిగా అక్రమ నిర్మాణం అని మాదారం సర్పంచ్ సాగరిక భర్త అయినా మంగీలాల్ భూమిని కబ్జా చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఒక గది నిర్మించాడని, దీనిపై మాదారం పంచాయతీ సెక్రెటరీ ద్వారా ఇంటి నెంబర్ కేటాయించుకొని సొంతం చేసుకుందామని ప్రయత్నించారని గ్రామ వార్డు సభ్యులు ఆరోపించారు. అంతేకాక ఈ నిర్మాణం గ్రామపంచాయతీ స్టోర్ రూమ్ కొరకు నిర్మిస్తున్నాము అని చెప్పి అందరిని తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నిర్మాణాన్ని సింగరేణి అధికారులు తొలగించడానికి వచ్చారు.కానీ నిర్మాణాన్ని తొలగిస్తున్న సమయంలో మాదారం సర్పంచ్ ధరావత్ సాగరిక వచ్చి అడ్డుకున్నారు. నిర్మాణాన్ని తొలగించవద్దని కోరారు. ఈ నిర్మాణం మా ఇంట్లో పనిచేసే లక్ష్మి అనే గిరిజన మహిళకు సంబంధించినదని దీన్ని తొలగించవద్దని చెప్పారు. నిర్మాణాన్ని తొలగించడానికి వచ్చిన సింగరేణి అధికారులు సర్పంచ్ సాగరిక కి, సింగరేణి ప్రాంతంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని, ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని తెలియజేసి గది నిర్మాణం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ని మాత్రమే తొలగించి, గదినిర్మాణ తొలగింపుకు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో వస్తామని చెప్పి వెళ్లిపోయారు.
• వివాదాస్పదమవుతున్న సింగరేణి అధికారులు తీరు
సింగరేణి ప్రాంతంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరిగిన వెంటనే స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేసేవారు. కానీ మాదారంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణం కూల్చకుండానే వెళ్లారు. గతంలో సింగరేణి ప్రాంతంలో ఎవరైనా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని తెలిసిన వెంటనే సింగరేణి S.N.P.C అధికారులు వచ్చి స్వయంగా కూలగొట్టేవారు. కానీ ఇప్పుడు ఈ నిర్మాణం నిర్మించింది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి సంబంధించిన నాయకుడైన మంగిలాల్ అని తెలియడంతో కూల్చివేయడానికి వెనుక ముందు చేస్తున్నాను. దీంతో గ్రామ ప్రజలంతా నాయకులకు ఒక చట్టం సామాన్యులకు ఒక చట్టం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


