ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో జైపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన దర్జి దుర్గ ప్రసాద్ కు మంచిర్యాల పట్టణంలోని టచ్ ఆసుపత్రి మాటేటి శ్రీనివాస్ (మేనేజింగ్ డైరెక్టర్ చొరవతో, డా. బి.ఎన్. రావు ఫౌండేషన్, డా. ఓంప్రకాశ్ సహకారంతో ఖరీదైన అత్యాధునిక పరికరాలతో ఉచిత మోకాళ్ళ ఆపరేషన్ ను నిర్వహించారు. ఈ ఆపరేషన్ ఖర్చు రూ.4 లక్షల వరకు అవుతుందని, పేదరికంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న దుర్గ ప్రసాద్ పరిస్థితిని, డా. బి.ఎన్.రావు ద్వారా తెలుసుకొని ఉచితంగా శస్త్ర చికిత్స చేశామని టచ్ హాస్పిటల్ డైరెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు మా హాస్పిటల్ తరుపున 700లకు పైగా ఉచితంగా శాస్త్ర చికిత్స లు అందించామని తెలిపారు.. ఉచితంగా ఆపరేషన్ చేసిన హాస్పిటల్ యాజమాన్యానికి దుర్గ ప్రసాద్ కుటుంబ సభ్యులు మరియు బంధువులు, కృతజ్ఞతలు తెలిపారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.


