Telugu Updates
Logo
Natyam ad

స్మృతి కుమార్తె ‘బార్’ వివాదం.. కాంగ్రెస్ ఫైర్..!

ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్

దిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీని వెంటనే కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆమె కుమార్తె గోవాలో చట్టవిరుద్ధంగా బార్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ ఆరోపణలను స్మృతి కుమార్తె తరపు న్యాయవాది తోసిపుచ్చారు. సిల్లీ సోల్స్ గోవా పేరిట తన క్లయింట్ ఎలాంటి రెస్టారంట్ను నడపడం లేదని, దానికి ఆమె యజమాని కాదని స్పష్టం చేశారు. అలాగే ఎలాంటి నోటీసులు అందలేదని వెల్లడించారు.

‘ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం. నిరాధారమైనవి. మా క్లయింట్ తల్లి, ప్రముఖ రాజకీయ నాయకురాలు స్మృతి ఇరానీని రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఈ ప్రచారం జరుగుతోంది. అసలు నిజాలు తేల్చకుండా, ఉద్దేశపూర్వకంగా విషయాన్ని సంచలనం చేసేందుకు తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరం’ అంటూ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.