Sunday, August 16, 2026
HomeTelanganaగణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే.

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే.

📰 Generate e-Paper Clip

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే.

కాగజ్ నగర్: పట్టణంలోని పెద్దవాగు వద్ద రేపు జరగనున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా మున్సిపల్ మరియు పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గత సంవత్సరం జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూడాలని, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కరెంటు సమస్య లేకుండా ఏర్పాట్లు చేయాలని ఎలక్ట్రిసిటీ ఎస్ఈ రాథోడ్ శేషారావు కి సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రామానుజం, సిఐలు ప్రేమ్ కుమార్, కుమార స్వామి, ఎస్ఐ సందీప్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, డీఈ రమాదేవి, భాజపా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, పట్టణ అధ్యక్షులు ఆర్మీ శివ, అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్ర చారి, మాజీ కౌన్సిలర్లు సింధం శ్రీనివాస్, బాల్క శ్యామ్, అరుణ్ లోయ, సంతోష్ ఠాకూర్, పెద్ది హరీష్, సదానందం, మహేష్ ఠాకూర్, రెహన్, అనిల్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.