Telugu Updates
Logo
Natyam ad

రివర్స్ ఫ్లో’ జలపాతం చూశారా..?

ప్రకృతి సోయగం.. ఇదో అద్భుత దృశ్యం.. ‘రివర్స్ ఫ్లో’ జలపాతం చూశారా..?

ఆంజనేయులు న్యూస్: వేసవి వెళ్లిపోయి రుతుపవనాలు రాగానే వృక్షజాలం, జంతుజాలం తిరిగి జీవం పోసుకుంటుంది. వర్షపు చినుకులు కొత్తందాలకు రూపం పోస్తాయి. వాగులు, వంకలు, జలపాతాలు ఇలా.. ఎన్నో ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. కొద్దిరోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో మహారాష్ట్ర నానేఘాట్లోని ఓ జలపాతం విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా కొండపై నుంచి జాలువారే జలపాతం కిందకు పారుతుంది.. కానీ, నానేఘాట్ లోని ఈ జలపాతం నీరు మాత్రం పైకి వెళ్లడం విశేషం. జలపాతం ఎత్తులో ఉండటం, తీవ్ర గాలుల కారణంగా నీరు నేరుగా కిందపడకుండా పైకి వెళుతూ నెమ్మదిగా కిందపడుతోంది. గాలి వేగం పరిమాణం సమానంగా.. గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా ఉన్నప్పుడు పశ్చిమ కనుమల పరిధి నానేఘాట్లోని ఈ జలపాతం అద్భుతం’ అంటూ ఓ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుసాంతా నందా ట్విటర్ లో పంచుకున్నారు. చుట్టూ పచ్చదనం, ఆ జలపాతం సోయగాలను చూసిన నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు. కాగా, ఈ వీడియోను ఇప్పటికే 3.6లక్షల మందికి పైగా వీక్షించారు. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘నేను ఈ ప్రాంతాన్ని సందర్శించా. ఇది భూతల స్వర్గం’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఒక్కసారైనా ఈ ప్రాంతంలో ‘పర్యటించాలి’ అని మరికొందరు తమ కోరికను వెలిబుచ్చుతున్నారు.