Telugu Updates
Logo
mobile after logo

రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గేది లేదు.

ఆదివాసీ సర్పంచ్ నాయకులు సీడాం అన్నిగా.

ఆంజనేయులు న్యూస్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆదివాసీ సర్పంచ్ ల నాయకులు సీడాం అన్నిగా అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కొమురం సూరు భవన్ లో ఏర్పాటు చేసిన ఆదివాసీ సర్పంచ్ ల సమావేశంలో ఆయన మాట్లాడారు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ముందునుంచీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళిన పట్టించుకోలేదనీ  ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఏ సమస్యలున్నా పరిష్కరించేందుకు సిద్ధమని, మంత్రులతో మాట్లాడి నిధులు కేటాయించి, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడతామని. పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఉప సంహరించుకోని, పార్టీలో మల్లి రావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కోరినట్లు చెప్పారు. ప్రతి సారి అభివృద్ధి పనులకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చి, అదికార పార్టీ నాయకులు మమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. ఈసారి ఎన్ని హామీలు ఇచ్చిన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సర్పంచ్ లు కోట్నక కిష్టు, దేవ్ రావ్, పెందుర్ పవన్ కుమార్, దౌలత్ రావ్, మనోహర్, మాడావి బాలు అడ జైరాం, గంగరాం,  తదితరులు పాల్గొన్నారు.

Post bottom