ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: జిల్లాలోని జైనథ్ పోలీస్ స్టేషన్ ను సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్షించారు. పోలీస్ పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. క్రైమ్ రేట్ గురించి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ నందు రికార్డుల నిర్వహణ, నవీకరణ ప్రతిరోజు సరైన సమయంలో నిర్వహిస్తూ ఉండాలి అని తెలిపారు. ప్రతి గ్రామానికి విలేజ్ పోలీస్ ఆఫీసర్ కేటాయించి పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను త్వరగా పరిష్కరించే దిశగా వ్యవస్థను నిర్మించాలి అని తెలిపారు. ప్రతి గ్రామం లో సాయంత్రం సమయాలలో సిఐ స్థాయి ఎస్ఐ స్థాయి అధికారులు సందర్శిస్తూ గ్రామంలో ఉన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తూ పరిష్కరించే దిశగా పోలీసు మీకోసం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. సిబ్బందికి ఎలాంటి సమస్యలున్నా ధైర్యంగా స్థిరపాలని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వీలైనంత వరకు అన్ని పోలీసు కార్యాలయాలలో సిబ్బందికి వారాంతపు సెలవు పద్ధతిని అమలు చేసే విధంగా సిబ్బంది విధులను కేటాయించాలి. మండలంలో ఉన్న రౌడీ లపై సరైన రౌడీ షీట్లు ఏర్పాటుచేసి ప్రతిరోజు పర్యవేక్షించాలి అని తెలిపారు. గంజాయి పూర్తిగా నిర్మూలించే వరకు సమాచార వ్యవస్థను మరింత పటిష్టంగా మెరుగుపరచుకొని మాదకద్రవ్యాలను పూర్తిగా అరికట్టాలని తెలిపారు. బ్లూ కోర్ట్, 100 డైల్ ప్రతిరోజు పెట్రోలింగ్ గస్తీ నిర్వహిస్తూ ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలైన నిర్వహించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ సరైన క్రమశిక్షణ, జవాబు దారితనం,అలవర్చుకోని, అవలంబించాలని నీతి నిజాయితీలతో విధులను నిర్వర్తించాలని సూచించారు. కోర్టు డ్యూటీ అధికారి ఎప్పటికప్పుడు కోర్టుల నందు నిందితులకు నేరస్తులకు శిక్షలు పడేవిధంగా సాక్షులను సరైన సమయంలో కోర్టుల నందు హాజరు పరిచేలా చూసుకోవాలన్నారు. సిబ్బంది విధులు సీఐ మరియు ఎస్ఐ స్థాయి అధికారులకు మంచి పేరును వచ్చే విధంగా ఉండాలన్నారు. స్టేషన్ రిసెప్షన్ నందు ఎక్కువ ఫిర్యాదులు వచ్చే విధంగా సిబ్బంది ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా విధులను నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, జైనథ్ సి ఐ డి సాయినాథ్, ఎస్సై వి పురుషోత్తం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


