Telugu Updates
Logo
mobile after logo

పోలీస్ సహాయ పోస్టర్ ఆవిష్కరణ

రామగుండం సిపి ఎం శ్రీనివాస్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఆపద సమయంలో పోలీస్ సహాయం కోసం ప్రజల్లో చైతన్యం కల్పించడానికి రూపొందించిన వాల్ పోస్టర్ను గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ.. పెట్రోల్ కార్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహిస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆపదలో చిక్కుకున్న సమయంలో డయల్ 100 కాల్ చేస్తే వెంటనే బాధితులకు తక్షణ సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. మహిళలు మరియు చిన్న పిల్లల రక్షణ విషయంలో పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని, మహిళల భద్రత, ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణ కొరకు షిటీమ్స్, ఆధ్వర్యంలో విద్యార్థినీలు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటున్నారని ఎవరైనా వేధించిన, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడిన, ఉద్దేశపూర్వకంగా వెంబడించిన విద్యార్థినిలు, మహిళలు అత్యవసర పరిస్థితులలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 8712656597, షీ టీం నెంబర్ 6303923700 కి కాల్ చేసి, వాట్సాప్ ద్వారా సందేశం పంపించి లేదా డయల్ 100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని మహిళలు,చిన్నారుల భద్రత కోసం, ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో భద్రతకు తక్షణ సహాయం అందించడానికి, లైవ్‌ లొకేషన్‌ షేర్ చేయడానికి, ప్రయాణమార్గం నావిగేట్‌ చేయడానికి, ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు పసిగట్టి పోలీసులు అప్రమత్తం కావడానికి వీలైన అనేక ప్రత్యేక ఫీచర్లతో T-SAFE యాప్‌ రూపొందించారని ఇట్టి యాప్ ను అందరు ఉపయోగించుకోవలని రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,(ఐజి) అన్నారు. ఈ కార్యక్రమం లో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి.రాజు ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్,మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఇంచార్జి యస్.ఐ. వి. హైమ, పెద్దపల్లి షీ టీమ్ ఇంచార్జ్ ఏ.యస్.ఐ.మల్లన్న, సిబ్బంది కానిస్టేబుల్స్ సతీష్, శ్రావణ్ కుమార్,సురేష్ మరియు మహిళా కానిస్టేబుల్స్ జ్యోతి, స్నేహాలత పాల్గొన్నారు.

Post bottom