Telugu Updates
Logo
mobile after logo

పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని గవర్నర్ కు వినతి

మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండలంలోని కోయపోచగూడెంలో ఆదివాసీ గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం బీజేపీ నాయకులు గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ను కోరారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గిరిజన రైతులతో కలిసి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్, జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను ప్రభుత్వం టైగర్ జోన్ గా ప్రకటించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అర్ధరాత్రి గిరిజన మహిళలను అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు వారు తెలిపారు. పోడు భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని వారు గవర్నర్ ను కోరారు. గిరిజనుల సమస్యలు విన్న గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు వారు వెల్లడించారు..

Post bottom