Telugu Updates
Logo
mobile after logo

ప్లాస్టిక్ బియ్యం కలకలం..!

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: చింతలమానేపల్లి మండలంలోని కరవెల్లి గ్రామంలోని రేషన్ షాప్ లో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపాయి. వివరాల ప్రకారం. కర్జవెల్లి గ్రామంలోని రేషన్ షాప్లో మే 27వ తేదీ వరకు డీలర్ బియ్యం ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలతో అదే రోజు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశాడు. మిగిలిన అదే బియ్యాన్ని డీలర్ జూన్ ఒకటవ తేదీ నుండి పంపిణీ చేస్తున్నాడు. అయితే రేషన్ బియ్యం తీసుకున్న లబ్దిదారులు ఆ బియ్యాన్ని వండి చూడగా ముద్దగా మారుతున్నాయని. అలాగే పిండి వంటలు, ముగ్గు పిండి లాంటివి తయారు చేసుకోవడానికి నీళ్లలో నానపెడితే బియ్యం నీటిలో పైకి తేలుతున్నాయని బియ్యం తీసుకున్న పలువురు రేషన్ కార్ లభిదారులు తెలిపారు.

Post bottom