
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సోమవారం కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్డర్ డాక్టర్ ఉప్పలయ్య మాట్లాడుతూ రోడ్లు వెడల్పు చేయకుండా మున్సిపల్ నిధులతో నాలుగు ఐ ల్యాండ్స్ నిర్మిస్తుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రాజకీయ పార్టీల ప్లెక్సీల ఏర్పాటులో పక్షపాత వైఖరి అవలంభిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రంథాలయంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తే గాంధీ పార్కుకు తాళం వేసి ఇబ్బందికి గురిచేయడం పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.


