ప్రశ్నపత్రాలు లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని – బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ శనివారం డిమాండ్ చేశారు.
బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: టీఎస్ పీఎస్.సీ ప్రశ్నపత్రాలు లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని మరియు పరీక్షలకు సిద్ధం అవుతున్న యువతకు 1 లక్ష రూపాయల నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ శనివారం బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కార్యాలయాన్ని బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు ముట్టదించారు.. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని ఎన్ని కలలు పెట్టుకున్న యువత ఆశలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలరసిందని అన్నారు. TSPSC లో ప్రశ్న పత్రాల లీకేజీ మంత్రి కేటీఆర్ అండదంతలతో జరుగుతుందని టీఆర్ఎస్ కార్యకర్తలకు ఈ ప్రశ్న పత్రాలు అందించి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ జీవితాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం అడుతుందని అన్నారు. ఒక్కరూ పేపర్ లీక్ చేయడం వలన ప్రభుత్వం తప్పు పట్టడం సరి కాదని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. ఒక్క కేసిఆర్ వల్ల రాష్ట్రం మొత్తం నాశనం అయింది చాలదా అని అన్నారు. నిరుద్యోగ యువత తల్లిదండ్రులు కష్టపడి తమ పిల్లను చదివించి హైదరాబాద్ కి పంపి వేల రూపాయల తో కోచింగ్ లు ఇప్పిస్తు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతుంది అని అన్నారు. నిరుద్యోగ యువత ఎవరు కూడా అధైర్య పడవద్దని బిజెపి మీకు అండగా ఉండి నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తుందని భరోసానిచ్చారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని, సిట్టింగ్ జడ్జితో ఈ కేసును విచారణ జరిపించాలని మరియు పరీక్షలకు సిద్ధం అవుతున్న యువతకు 1 లక్ష రూపాయల నష్ట పరిహారం అందించాలి డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పోనుగోటి రంగ రావు, పెద్దపల్లి పురుషోత్తం, అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేష్, ఆకుల అశోక్ వర్ధన్, తుల ఆంజనేయులు, పట్టి వెంకట కృష్ణ, జొగుల శ్రీదేవి, మధవరపు రమణ రావు, బద్దే లక్ష్మన్ వంగపల్లి వెంకటేశ్వర్ రావు, వీరమల్ల హారి గోపాల్, అగల్ డ్యూటీ రాజు, విశ్వంభర్ రెడ్డి, వేల్పుల శ్రీనివాస్, సప్పిడి నరేష్, కోడి రమేష్, బెరే రామన్న యాదవ్, అట్కపురం రమేష్, రాజ్ కుమార్, శ్రీకృష్ణ దేవరాయలు, అమిరిషెట్టి రాజు, బొయిని దేవేందర్, రెడ్డిమల్ల అశోక్ మరియు తదితరులు పాల్గొన్నారు.


