Telugu Updates
Logo
mobile after logo

అర్ధరాత్రి మద్యం మత్తులో ఎస్ఐ వీరంగం

మంచిర్యాల పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మద్యం మత్తులో ఓ ఎస్సై వీరంగం సృష్టించారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మద్యం మత్తులో ఓ ఎస్సై వీరంగం సృష్టించారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని బెజ్జంకి పోలీసు స్టేషన్ ఎస్సై తిరుపతి తన స్నేహితులతో కలిసి హల్చల్ చేశారు. మద్యం మత్తులో రోడ్డుపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీరిపై స్థానికులు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న బ్లూకోట్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వారిని అక్కడినుంచి పంపించే ప్రయత్నం చేశారు. మద్యం మత్తులో ఎస్సైతోపాటు అతడి స్నేహితులు బ్లూకోట్ సిబ్బందిపైనా దాడి చేశారు. వారి వద్ద ఉన్న ట్యాబ్ లను ధ్వంసం చేశారు. అనంతరం బ్లూకోట్ సిబ్బంది ఎస్సైకి సంబంధించిన కారును స్థానిక పోలీసు స్టేషన్ కు తరలించి ఫిర్యాదు చేశారు.

Post bottom