మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో భూముల లే-అవుట్ల కొరకు అందిన దరఖాస్తుల సంబంధిత భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలకు లోబడి అనుమతించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో లే-అవుట్ కొరకు అందిన దరఖాస్తు సంబంధిత భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూముల అభివృద్ధి, ఇండ్ల నిర్మాణం, వెంచర్ల ఏర్పాటులో భాగంగా లే-అవుట్ కొరకు అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి నియమ, నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేయాలని తెలిపారు. లే-అవుట్ దరఖాస్తు సంబంధిత భూమి నిషేధిత జాబితా, ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్ పరిధిలో ఉన్నది.. లేనిది.. నిర్ధారించుకోవాలని, లే-అవుట్ సమీపంలో చెరువులు, వాగులు ఇతర ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూములు రక్షణ దిశగా చర్యలు తీసుకోవాలని, ఆక్రమిత ప్రభుత్వ భూములను చట్టం ప్రకారం చర్యలు తీసుకొని స్వాధీనపర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


