పెద్దపల్లి జిల్లాకు భూకంపం హెచ్చరిక.?

ఆంజనేయులు న్యూస్, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లాకు భూకంప హెచ్చరిక జారీ చేశారు. ఈనెల 10 నుంచి 17 మధ్య ఈ భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్లు ఎపిక్ ఎర్త్ క్వీక్ రీసెర్చ్ ఎనాలసిస్ సెంటర్ తెలిపింది. దీని ప్రభావం పెద్దపల్లి జిల్లా రామగుండం పై ఉండే అవకాశం ఉన్నట్లు గుర్తించింది. రామగుండం లో భూకంపం సంభవించే అవకాశం ఉన్నట్లుగా ఆ సంస్థ తన ట్విట్టర్ లో పేర్కొంది. దీంతో పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొద్దిరోజుల క్రితం బ్యాంకాక్, మయన్మార్ లలో సంభవించిన భూకంపం దాటికి భారీగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించిన విషయం పాఠకులకు తెలిసిందే.. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలోని పెద్దపల్లి జిల్లా రామగుండం కు భూకంప హెచ్చరిక జారి కావడం పట్ల సర్వత్ర ఆందోళన నెలకొంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో స్వల్ప భూకంపం జరిగిన దాని తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతం పూర్తిగా సింగరేణి భూగర్భ, ఓపెన్ కాస్ట్ గను లు విస్తరించి ఉండటంతో ప్రమాద తీవ్రత అత్యధికం గా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం.. భూకంప తీవ్రతపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..


