
మంచిర్యాల జిల్లా: జనాభాలో 93 శాతం ఉన్న బహుజనులు రాజ్యాధికారం సాధించేందుకు ఐక్యం కావాలని బిసి సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ నీలకంటేశ్వర్ రావు పిలుపునిచ్చారు. దండేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం చేపట్టిన పార్టీలు అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
ఈ సమావేశంలో బిసి సంఘాల నాయకులు దుర్గం రాజేష్, దుర్గం ఎల్లయ్య, రాజమల్లు, స్వామి, మల్లేశం గౌడ్, అక్కల కృష్ణ, బుద్దే ప్రభాకర్, కొట్టె వినోద్, కొండ శ్రీను, పెంట తిరుపతి, నామని రాజేష్, సమ్ము రాజన్న, మనోహర్ దేవన్న, ముత్యాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


