
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 గనిని శనివారం సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ అధ్యక్షుడు పేరం రమేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గనిలోని ఉద్యోగులను ఆరు నెలల పాటు డిప్యూటేషన్ పై ఆర్కే 7 గనికి బదిలీ చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గుర్తింపు సంఘం ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఉద్యోగులను బదిలీ చేయడం సరికాదన్నారు. అనంతరం గని మేనేజర్ తిరుపతికి మెమోరాండం అందజేశారు. ఈ కార్య క్రమంలో నాయకులు అర్జున్, రామకృష్ణ, వినోద్ కుమార్, కార్తికేయ, తదితరులు పాల్గొన్నారు.


