మంచిర్యాల షీ టీం ఎస్ఐ హైమ

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రామగుండం సీపీ ఆదేశానుసారం మంచిర్యాల షీ టీం ఎస్ఐ హైమ ఆధ్వర్యంలో మంగళవారం నస్పూర్ లోని బ్రిలియంట్ మోడల్ హై స్కూల్ లో ఫోక్సో చట్టం సైబర్ క్రైమ్ ఫై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై హేమ మాట్లాడుతూ.. వేధింపులకు గురైతే పోలీసులను సంప్రదించాలని, షి టీం అండగా ఉంటుందని రాష్ట్రంలో అత్యధికంగా మైనర్ బాలికలు సరియైన అవగాహన లేకపోవడం వలన ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు, 18 ఏళ్లలోపు పిల్లలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం కింద కేసు నమోదవుతుందని పిల్లలకు తల్లిదండ్రులు అధిక స్వేచ్ఛ ఇవ్వొద్దని, వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. వారు చేస్తున్న పనులపై నిఘా ఉంచాలని అన్నారు. పిల్లలను ఒంటరిగా ఉంచొద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో అయితే నానమ్మ, అమ్మమ్మ, అత్త వద్ద మాత్రమే వదిలి వెళ్లాలని వివరించారు.. అలాగే బాల్య వివాహాలు జరుగుతున్నట్లయితే వెంటనే చైన్ లైన్ 1098 కి సమాచారం అందించాలి, మానవ అక్రమ రవాణాను అరికట్టడం పై, సైబర్ క్రైమ్ నిరోధించడం, షీ టీం విధి విధానాలు, 100 డయల్, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్, టీ సేఫ్ అప్, మరియు పలు విషయాల పై పిల్లలకు అవగాహన కల్పించారు.. ఈ కార్యక్రమంలో షి టీం సభ్యులు శ్రవణ్, జ్యోతి, దివ్య, భరోసా సిబ్బంది ప్రియాంక, నవ్య కృష్ణ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు..


