
ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ ముగిసింది. ఈనెల 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు కొనసాగుతుందని పేర్కొంది. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను భాజపా కైవసం చేసుకునే అవకాశాలున్నాయని, ఈ రెండు కార్పొరేషన్లలో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించనుందని అంచనా వేసింది. రాష్ట్రంలోని 68-76 మున్సిపాలిటీలను హస్తం పార్టీ, 29-36 మున్సిపాలిటీలను బీఆర్ఎస్, 3-5 మున్సిపాలిటీలను భాజపా, 0-1 ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. 8-14 మున్సిపాలిటీల్లో ‘నువ్వా నేనా? ’ అన్నట్టు పోటీ ఉందని పేర్కొంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు 36 శాతం, బీఆర్ఎస్ కు 29.7 శాతం, భాజపాకు 19.3 శాతం, ఎంఐఎంకు 2 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించింది. కాంగ్రెస్ పార్టీ 1210-1290 వార్డుల్లో, బీఆర్ఎస్ 860-930, భాజాపా 250-270, ఎంఐఏం 35-44, సిపిఐ 12-17, సీపీఎం 10-14, ఇతరులు 90-110 వార్డులు గెలుచుకునే అవకాశముందని పీపుల్స్ పల్స్ సర్వే తెలిపింది. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంఐఎం కింగ్ మేకర్ కానుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ కూడా గెలిచే అవకాశాలు లేవు.
• కార్పొరేషన్ల వారీగా అంచనాలు :
రామగుండం: కాంగ్రెస్ 30-34, బీఆర్ఎస్ 16-20, భాజపా 3-6, ఇతరులు 4-7 డివిజన్లు
మంచిర్యాల: కాంగ్రెస్ 39-43, బీఆర్ఎస్ 8-12, భాజపా 6-9, ఇతరులు 1-2
కొత్తగూడెం: కాంగ్రెస్ 28-34, బీఆర్ఎస్ 7-9, సీపీఐ 14-16, ఎంఐఎం 2-4
మహబూబ్నగర్: కాంగ్రెస్ 26-30, బీఆర్ఎస్ 18-22, భాజపా 6-8, ఎంఐఎం 2-4, ఇతరులు 0-1
నల్గొండ: కాంగ్రెస్ 21-26, బీఆర్ఎస్ 8-12, భాజపా 6-10, 2 2-4, ఎంఐఎం 1-2
నిజామాబాద్: కాంగ్రెస్ 10-16, బీఆర్ఎస్ 2-4, భాజపా 26-31, ఎంఐఎం 8-12, ఇతరులు 1-2
కరీంనగర్: కాంగ్రెస్ 14-16, బీఆర్ఎస్ 10-12, భాజపా 24-29, ఎంఐఎం 6-9, ఇతరులు 1-3


