
లైవ్ ప్రసారాల ద్వారా శస్త్ర చికిత్సలు
అనుభవాలు పంచుకున్న అనుభవజ్ఞులైన వైద్యులు
సదస్సును జయప్రదం చేసిన అందరికీ ధన్యావాదాలు తెలిపిన
కార్యనిర్వాహక అధ్యక్షులు, డాక్టర్ రమణచారి ఈ.ఎన్.టి హాస్పిటల్ మంచిర్యాల
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మూడు రోజులుగా కరీంనగర్ శివారులోని నూగునూర్ లో గల ప్రతిమ మెడికల్ కళాశాలలో నిర్వహించిన చెవి, ముక్కు, గొతు వైద్యుల అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఏడో సదస్సు విజయవంతంగా ముగిసింది. ప్రతిమ మెడికల్ కళాశాలో ఏర్పాటు చేసిన ముగింపు సదస్సులో కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ రమణచారి ఈ.ఎన్.టి హాస్పిటల్ మంచిర్యాల జిల్లా మరియు జాతీయ, రాష్ట్ర ప్రముఖ ఈ ఎన్.టి వైద్యులు వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్. రమణాచారి మాట్లాడుతూ.
తెలంగాణలోని 600 మంది. ఈ.ఎన్.టి వైద్యులు హాజరైనట్టు తెలిపారు. మలేషియా, జైపూర్ ప్రాంతాల నుండి ఈఎన్.టి వైద్య నిపుణలు హాజరై వైద్య రంగంలో వచ్చిన నూతన పోకడలపై ప్రసగించి, వివిధ రకాల ఈ.ఎన్.టి శస్త్ర చికిత్సలు చేసినట్టు చెప్పారు. ఈ సదస్సులో వైద్యులు ఉపన్యాసాలతో పాటు, పీ. ఈ విద్యార్థులు పత్ర సమర్పణలు ఉంటాయని వాటిలో ఉత్తమమైన పత్ర సమర్పణలు చేశారన్నారు. ఈ సదస్సు ను జయప్రదం చేసిన వైద్యులకు అసోసియేషన్ వైద్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం వైద్యులను సత్కరించారు. ఈ సమావేశంలో ఇ.ఎన్.టి వైద్యులు డాక్టర్. వి. సాయి ప్రసాద్ రావు, డాక్టర్. ఎల్. రవికాంత్, డాక్టర్. ఎం. మహేష్ బాబు, డాక్టర్ రాంచంద్రా డాక్టర్ శ్రీపతి నాయుడు, డాక్టర్. శ్రవణ కుమార్, డాక్టర్. విజయ్. డాక్టర్ శశిధర్, డాక్టర్. రాజ్ కుమార్, డాక్టర్ వంశీ, డాక్టర్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.


