Telugu Updates
Logo
mobile after logo

డబుల్ బెడ్రూమ్ పథకం. సొంత స్థలాల వారికి గుడ్ న్యూస్

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: రాష్ట్రంలో సొంత స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.7,350 కోట్లు కేటాయించింది. కుటుంబానికి రూ.3 లక్షలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపింది. అలాగే వచ్చేఏడాదికి డబుల్ బెడ్రూమ్ పథకం కింద గృహాల నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయనున్నట్లు ప్రభుత్వం శాసనసభకు వెల్లడించింది. ప్రభుత్వం ఇంతవరకు 2.75 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయగా దాదాపు 1.37 లక్షల గృహాల నిర్మాణం పూర్తయింది. మరో 53, 984 ఇళ్ల నిర్మాణం 90 శాతం పూర్తికాగా మిగతావి నిర్మాణదశలో ఉన్నాయి. లబ్ధిదారుల వాటా లేకుండా ప్రభుత్వమే పూర్తి నిధులు వెచ్చించి చేస్తున్న నిర్మాణాలు వేగంగా పూర్తిచేసి అందించనున్నట్లు ప్రభుత్వం వివరించింది.

ఈ మేరకు లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించేందుకు సాంకేతిక సహాయాన్ని తీసుకోనున్నామని, ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గృహనిర్మాణాల్లో లబ్ధిదారులుగా ఎంపికైన వారు దరఖాస్తుదారుల్లో ఉంటే వారిని తొలగించి, ఏ పథకం కింద లబ్ధి పొందనివారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది.

Post bottom