Telugu Updates
Logo
mobile after logo

హెచ్ఎం ను సస్పెండ్ చేయాలి.?

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మందమర్రి మండలం సారంగపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల డీఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రధానోపాధ్యాయురాలు పాఠశాలకు రాని సమయంలో మధ్యాహ్నం భోజనం వడ్డించే వారితో బోధించడం విచారకరం అన్నారు. బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు గోపాల్, జాగిరి రాజేష్, పురేళ్ళ నితీష్, పవన్ పాల్గొన్నారు.

Post bottom