Telugu Updates
Logo
mobile after logo

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా ట్రెసా డైరీ ఆవిష్కరణ

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి ఆదేశానుసారం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు దేశ్ పాండే ఆధ్వర్యంలో నస్పూర్ లోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో (ట్రేసా) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం తరపున శనివారం జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 2026 సంవత్సరానికి సంబంధించిన ట్రెసా డైరీ, క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదగా ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూమి పై పనులన్నీ చేసేది జనన, మరణ ధృవ పత్రాలు జారీ చేసేది రెవెన్యూ ఉద్యోగులేనని, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకంలో రెవెన్యూ ఉద్యోగులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.. జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు.. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు దేశ్ పాండే, జిల్లా కార్యదర్శి వి.వి.ఆర్.కే.డి. ప్రసాద్, ట్రెసా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎల్ కృష్ణ, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బి.సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులు జె. అశోక్, కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు మధుసూదన్, అరవింద్, ట్రెసా జిల్లా, డివిజన్ కార్యవర్గ సభ్యులు, గ్రామ పాలన అధికారుల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బంటు శ్రీనివాస్, కుంసోత్ శ్రీనివాస్ మరియు పలువురు జిపిఓలు తదితరులు పాల్గొన్నారు..

Post bottom