Telugu Updates
Logo
mobile after logo

గందరగోళంగా విద్యా వ్యవస్థ..!

తెలంగాణ: విద్యా వాలంటీర్లు వచ్చేనా.. ఖాళీ పోస్టులు సర్దుబాటు తోనే సరేనా.. గందరగోళంగా విద్యా వ్యవస్థ.. ఈ ఏడాది జూన్ 13 నుండి కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. పాఠశాలలు ప్రారంభించి రెండు వారాలు గడుస్తున్నా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల విషయంలో మాత్రం ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టమైన ఉత్తర్వులు రాలేదు. గత 4ఏళ్లుగా పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ ప్రక్రియ లేకపోవడంతో ఖాళీగా ఉన్నాయి. సూర్యపేట జిల్లా లో ప్రాధమిక, ప్రాధమి కొన్నత పాఠశాల ల్లో సుమారు వివిధ క్యాటగిరి ల్లో 500 వరకు పోస్టుల ఖాళీగా ఉన్నాయి. కోవిడ్ కు ముందు ఖాళీ పోస్టుల్లో విద్యావలంటీర్లను నియమాకం చేశారు. కానీ ఇప్పటి వరకు వాలంటీర్ల నియామకపు ఊసేలేదు. మరోవైపు గత 3,4 సంవత్సరాలుగా పదవి విరమణ పొందిన పోస్టులతో పాటు పలు కారణాలతో కొన్ని పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ప్రధానంగా ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పలు పాఠశాలలకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పోస్టులు ఖాళీగా ఉండి సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ఇన్చార్జిగా పని చేస్తున్నారు.

గత ఆరేళ్లుగా పదోన్నతులు లేక భర్తీ లు లేక ఆ పోస్టులు అలాగే ఉన్నాయి. మధ్యలో కంటితుడుపు చర్యగా ప్రాథమిక పాఠశాలలో అర్హతలు ఉన్న ఉపాధ్యాయులను హై స్కూల్ లలో తాత్కాలికంగా సర్దుబాటు చేసి సబ్జెక్ట్ అని చెప్పించారు. కాగా ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో కూడా విద్యార్థుల నమోదు పెరగడంతో సర్ ప్లస్ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో విద్యా వాలంటీర్ల ప్రక్రియ చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఉపాధ్యాయ శిక్షణలు పూర్తిచేసిన నిరుద్యోగ అభ్యర్థులు సైతం విద్యా వాలంటీర్ గా నియమాకాలను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సబ్జెక్టు టీచర్ లేకపోవడంతో బోధన సజావుగా కొనసాగదని ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు పదోన్నతుల తో ఉన్నత పాఠశాలలో ఖాళీలను భర్తీ చేయాలని సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం విద్యారంగంపై అంకితభావంతో దృష్టి సారించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

Post bottom