మహిళలు, చిన్నారుల రక్షణ, బాధితులకు అండగా భరోసా కేంద్రం

ఆంజనేయులు న్యూస్, రామగుండం పోలీస్ కమిషనరేట్: లైంగిక దాడులకు గురైన మహిళలు, బాలబాలికలకు భరోసా, రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భరోసా కేంద్రాల ఏర్పాటులో భాగంగా మంగళవారం పెద్దపల్లి జోన్ లోని రంగంపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో సీసీసీ నస్పూర్ లో ఉమేన్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన భరోసా కేంద్రాలని రాష్ట్ర పోలీస్ డిజిపీ రవి గుప్తాతో అడిషనల్ డిజిపీలు షికా గొయల్, మహేష్ భగత్ తో కల్సి వర్చవల్ ద్వారా జనగాంలో నూతనంగా నెలకొల్పబడిన భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పెద్దపల్లి జోన్ డా.డిసిపి చేతన ఐపిఎస్., మరియు మంచిర్యాల జోన్ ఏసీపీ లు, పోలీసు అధికారులతో కలిసి శిలా ఫలాకాన్ని ప్రారంభించారు. భరోసా కేంద్రం లైంగిక దాడులకు గురైన బాధితులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించబడుతుంది. ఇందులో భాగంగానే భాదితులకు న్యాయపరమైన సహకారంతో పాటు వైద్య సహకారాన్ని అందించబడుతుంది. వీటితో పాటు బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది. అవసరంనుకుంటే బాధితులకు భరోసా కేంద్రంలో ఆశ్రయం కల్పించబడటంతో పాటు బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారన్ని అందించడం జరుగుతుంది.ఈ కేంద్రంలో లీగల్, మెడికల్ సిబ్బంది తో పాటు ఇతర సహాయ సిబ్బందికి సంబందించి పూర్తిగా మహిళలు విధులు నిర్వహిస్తారని. ముఖ్యం బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లనవసరం లేకుండా బాధితులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించబడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్, పెద్దపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్, గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, జైపూర్ ఏసీపీ మొహన్, బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, ఇన్స్ స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్ స్పెక్టర్లు, ఎస్ఐ లు, భరోసా కేంద్రం సిబ్బందితో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


