ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
దండారి వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్
ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకాంక్షించారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం దండారి ఉత్సవాలు. భీంపూర్ మండలంలోని గుబిడి భగవాన్పూర్ గ్రామాల్లో జరిగిన దండాలు ఉత్సవాలలో ఎస్పీ అటల్ మహాజన్ పాల్గొన్నారు.ఈ దండాలు ఉత్సవాలలో ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి గ్రామ ప్రజలు సాంప్రదాయ డప్పు వాయిద్యాల నడుమ గుస్సాడి నృత్యాల నడుమ గౌరవ సాదరంగా ఆహ్వానాన్ని పలికారు. సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించి జిల్లా పోలీసు అధికారులతో కలిసి ఆదివాసీలు గ్రామ పెద్దలు యువత సామూహిక భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివాసిలతో కలిసి గుస్సాడీ నృత్యం చేసి అందర్నీ అలరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఆదివాసీలది ప్రపంచంలోనే అత్యంత విభిన్న సంస్కృతి కలిగిన సాంప్రదాయమని పేర్కొన్నారు. తన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఉన్నత విద్యను అభ్యసించి భావితరాలకు తమ సాంప్రదాయాలను తెలియజేసే విధంగా అభివృద్ధిని సాధించాలని సూచించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ విద్య, ఉపాధి వ్యవసాయం రంగాలలో ఉన్నత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ముఖ్యంగా యువతకు, పిల్లలకు చదువు పట్ల ప్రాధాన్యతను తెలియజేసి విద్యకు మొదటి ప్రాధాన్యతను కేటాయించాలని తెలియజేశారు. తల్లిదండ్రులు యువతను విద్యార్థులను ఉన్నత చదువుల అభ్యసించేలా ప్రోత్సహించాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని గంజాయి లాంటి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జిల్లా పోలీసులతో కలిసి పోరాడాలని సూచించారు.

ముఖ్యంగా ఎలాంటి వైద్య సమస్యలు ఉన్న వైద్య రంగాన్ని సంప్రదించాలని ప్రభుత్వ ప్రైవేటు వైద్యులను సంప్రదించి చికిత్సలను తీసుకోవాలని, ఎలాంటి బాబాలను మంత్రాలను తంత్రాలను నమ్మవద్దని సూచించారు. జిల్లా పోలీసులు 24 గంటలు ఆదివాసులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, జైనథ్ సిఐ జి శ్రావణ్, భీంపూర్ ఎస్ఐ విక్రమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


