Telugu Updates
Logo
mobile after logo

ఏసీపి కార్యాలయాన్ని తనిఖీ చేసిన: సిపి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వార్షిక తనిఖీల్లో భాగంగా జైపూర్ ఏసిపి కార్యాలయాన్ని మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం ప్రాధాన్యతగా సిబ్బంది. విధులు నిర్వహించాలన్నారు. నేర నియంత్రణలో భాగంగా ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ నేరాల విషయంలో ప్రభుత్వం, పోలీస్ వారు చేస్తున్న సూచనలను ప్రజలు పాటించేలా అవగాహన కార్య క్రమాలు నిర్వహించాలని తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలన్నారు. భూ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశిస్తూ, కోర్టుల ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకునే విధంగా ప్రజలకు సూచించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసిపి నరేందర్, చెన్నూర్ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, శ్రీరాంపూర్ సీఐ రాజు, జైపూర్ ఎస్ఐ రామకృష్ణ, ఎస్ఐలు పాల్గొన్నారు.

Post bottom