Wednesday, October 14, 2026
Homeఆరోగ్యoఇకపై అన్ని ఆస్పత్రుల్లో చికిత్సల ధరల ప్రదర్శన తప్పనిసరి!

ఇకపై అన్ని ఆస్పత్రుల్లో చికిత్సల ధరల ప్రదర్శన తప్పనిసరి!

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ, అక్టోబర్ 13, ( ఆంజనేయులు న్యూస్ )

దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో అందించే చికిత్సలకు సంబంధించిన ధరలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ప్రతి చికిత్సకు సంబంధించిన ధరలను ఇంగ్లిష్‌తో పాటు స్థానిక భాషలోనూ స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొంది. ఈ నిబంధన అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చులపై రోగులకు ముందస్తు అవగాహన కల్పించడంతో పాటు, బిల్లుల విషయంలో తలెత్తే వివాదాలు, ఫిర్యాదులను తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.