Wednesday, October 14, 2026
HomeTelanganaనస్పూర్ 34వ డివిజన్‌లో మొక్కల పంపిణీ

నస్పూర్ 34వ డివిజన్‌లో మొక్కల పంపిణీ

📰 Generate e-Paper Clip

మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి: కార్పొరేటర్ అగ్గు సాగర్

మంచిర్యాల అక్టోబర్ 13, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ 34వ డివిజన్‌లో మంగళవారం మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అగ్గు సాగర్, కాలనీ అధ్యక్షులు, వార్డు ఆఫీసర్ సాయికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అగ్గు సాగర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొక్కలు పెంచడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. డివిజన్‌లోని ప్రజలందరూ మొక్కల పెంపకంపై ఆసక్తి చూపాలని, పంపిణీ చేసిన మొక్కలను జాగ్రత్తగా పెంచి సంరక్షించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.