నస్పూర్ 34వ డివిజన్‌లో మొక్కల పంపిణీ
మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి: కార్పొరేటర్ అగ్గు సాగర్ మంచిర్యాల అక్టోబర్ 13, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ 34వ డివిజన్‌లో మంగళవారం మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అగ్గు సాగర్, కాలనీ అధ్యక్షులు, వార్డు ఆఫీసర్ సాయికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అగ్గు సాగర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని...