Friday, August 21, 2026
HomeTelanganaవిద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలి

విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలి

📰 Generate e-Paper Clip

మంచిర్యాల కలెక్టర్ భారతి హోళ్ళికేరి

ఆంజనేయులు న్యూస్,, మంచిర్యాల జిల్లా: విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో ముందుండాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల జిల్లా కలెక్టర్ చాంబర్ లో జిల్లా స్థాయి యువజనోత్సవాలలో పాల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలలో ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థులు వివిధ విభాగాలలో పాల్గొని జిల్లా స్థాయికి ఎంపికయ్యారని, జానపద నృత్య విభాగంలో జి. స్వాతి గ్రూప్, ఉపన్యాస పోటీలలో బి. వెన్నెల ఎంపికయ్యారని తెలిపారు. వీరు ఈ నెల 9, 10 తేదీలలో హైదరాబాద్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా, యువజన శాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డా॥ వి.రజని, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.