Wednesday, August 19, 2026
HomeCrimeగొంతుకోసి.. జైళ్ల శాఖ డీజీ దారుణ హత్య.!

గొంతుకోసి.. జైళ్ల శాఖ డీజీ దారుణ హత్య.!

📰 Generate e-Paper Clip

జమ్మూకశ్మీర్ డీజీపీ(జైళ్ల విభాగం) హేమంత్ కుమార్ లోహియా.. తన ఇంటి సహాయకుడి చేతిలో హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆంజనేయులు న్యూస్, శ్రీనగర్: జమ్మూకశ్మీర్ పోలీసు ఉన్నతాధికారి సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. తన ఇంట్లో పనిచేసే వ్యక్తి ఆయన గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడురోజుల పర్యటన జరుగుతుండగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జమ్మూకశ్మీర్ డీజీపీ(జైళ్ల విభాగం) హేమంత్ కుమార్ లోహియా.. 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. తన ఇంటికి మరమ్మతులు చేయిస్తుండటంతో జమ్ము శివారులోని తన స్నేహితుడి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు. ఆయన గొంతు కోసిన ఆనవాళ్లతో పాటు, ఒంటిపై కాలిన గాయాలున్నాయి. తీవ్ర డిప్రెషన్ లో ఉన్న ఇంటి సహాయకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కెచప్ బాటిల్ పగులకొట్టి గొంతుకోసి, తర్వాత ఆ మృతదేహాన్ని మంటల్లో కాల్చేయాలని యత్నించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మంటలు రావడం గుర్తించి భద్రతా సిబ్బంది ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే గది లోపలి నుంచి గడియ పెట్టి ఉన్నట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈ హత్యకు తామే బాధ్యులమంటూ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్(పీఏఎఫ్ఎఫ్) అనే ఉగ్ర సంస్థ ప్రకటించుకున్నప్పటికీ.. పోలీసులు మాత్రం ఉగ్రకోణాన్ని ప్రస్తావించలేదు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.