Sunday, November 29, 2026
HomeTelanganaఇన్‌స్టాగ్రామ్‌లో డాక్టర్ అవతారం.. రూ.10 లక్షలకు కుచ్చుటోపీ!

ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్టర్ అవతారం.. రూ.10 లక్షలకు కుచ్చుటోపీ!

సోషల్ మీడియా పరిచయంతో భారీ మోసం.. ఇద్దరు నిందితుల అరెస్ట్..

📰 Generate e-Paper Clip

సైబరాబాద్, నవంబర్ 29, ( ఆంజనేయులు న్యూస్ )

సోషల్ మీడియాను వేదికగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ధనవంతుడైన డాక్టర్‌నంటూ ఓ వ్యక్తిని నమ్మించిన నిందితుడు, అతడి వ్యక్తిగత వివరాలను సేకరించి ఏకంగా రూ.10.05 లక్షలు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాధితుడికి పరిచయమైన ప్రధాన నిందితుడు, తాను డాక్టర్‌నని నమ్మిస్తూ సన్నిహితంగా మెలిగాడు. ఈ క్రమంలో బాధితుడి వ్యక్తిగత వివరాలు, ఓటీపీలను సేకరించి దుర్వినియోగం చేశాడు. బాధితుడి పేరుతో రుణం తీసుకుని రూ.10.05 లక్షలను కాజేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడి తల్లి కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి సుమారు 20 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల హెచ్చరిక.. సోషల్ మీడియాలో పరిచయమయ్యే అపరిచిత వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరిస్తున్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.