Saturday, October 24, 2026
HomeTelanganaమంచిర్యాలమంచిర్యాల విశ్వనాథ ఆలయానికి మహర్దశ!

మంచిర్యాల విశ్వనాథ ఆలయానికి మహర్దశ!

📰 Generate e-Paper Clip

రూ.10 కోట్లతో పునర్నిర్మాణం.. తొలి విడతలో రూ.5 కోట్ల పనులు!

మంచిర్యాల, అక్టోబర్ 24, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. పట్టణంలోని ప్రసిద్ధ విశ్వనాథ ఆలయాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దేందుకు పునర్నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవతో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా తొలి విడతలో రూ.5 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఐఏఎస్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డీఓ శ్రీనివాస్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల విశ్వనాథ ఆలయంతో పాటు గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పుష్కరాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేపట్టనుందని అధికారులు తెలిపారు. అనంతరం పట్టణంలోని కాలేజీ రోడ్డులో ఉన్న గోదావరి పుష్కరాల ఘాట్ అభివృద్ధి పనులను పరిశీలించారు. పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి సారించారు. విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణం పూర్తయితే మంచిర్యాల పట్టణ ఆధ్యాత్మిక ప్రాధాన్యం మరింత పెరగనుంది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవతో చేపడుతున్న ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ఆలయం సరికొత్త రూపును సంతరించుకోనుంది. దీంతో ఆలయాన్ని దర్శించుకునే భక్తులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ముక్త రవి, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గుండ సుధాకర్, సంబంధిత అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.