Saturday, October 24, 2026
HomeTelanganaఅధిక సాంద్రత పత్తి సాగుతో అధిక దిగుబడులు

అధిక సాంద్రత పత్తి సాగుతో అధిక దిగుబడులు

📰 Generate e-Paper Clip

శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలి

కాగజ్‌నగర్, అక్టోబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ )

అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేపట్టి మెరుగైన దిగుబడులు సాధించేందుకు రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం అరెగూడ గ్రామంలో రాశి కంపెనీ ఏరియా మేనేజర్‌ ఐలయ్య ఆధ్వర్యంలో పత్తి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాటన్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసిన రైతుల పొలాలను సందర్శించి, సాధారణ సాగు విధానానికి, అధిక సాంద్రత సాగు విధానానికి మధ్య ఉన్న తేడాలను పరిశీలించారు. పంట నిర్వహణ, చీడపీడల నివారణ, దిగుబడుల పెంపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏడీఏ మనోహర్‌ మాట్లాడుతూ, కాటన్‌ మిషన్‌ కార్యక్రమం కింద ప్రభుత్వం అందించిన పురుగుమందులను సూచించిన విధంగానే వినియోగించాలని తెలిపారు. పంటపై చీడపీడల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరమైన సలహాల కోసం వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. రైతుల సాగు అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ, అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ సాగు చేపడితే మెరుగైన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. రాశి కంపెనీ ఏరియా మేనేజర్‌ ఐలయ్య మాట్లాడుతూ, పత్తి సాగులో రైతులకు ఏవైనా సందేహాలు ఉంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. రైతుల అభివృద్ధికి కంపెనీ తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి పద్మ, వసంతరావు, ఏఈఓలు రెహమాన్‌, శ్రీనివాస్‌, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.