అధిక సాంద్రత పత్తి సాగుతో అధిక దిగుబడులు

శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలి కాగజ్‌నగర్, అక్టోబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ ) అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేపట్టి మెరుగైన దిగుబడులు సాధించేందుకు రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం అరెగూడ గ్రామంలో రాశి కంపెనీ ఏరియా మేనేజర్‌ ఐలయ్య ఆధ్వర్యంలో పత్తి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాటన్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసిన రైతుల పొలాలను సందర్శించి, సాధారణ...