Thursday, October 8, 2026
HomeTelanganaవిద్యా భారతి హైస్కూల్‌కు జాతీయ స్థాయి డైనమిక్ స్కూల్ అవార్డు

విద్యా భారతి హైస్కూల్‌కు జాతీయ స్థాయి డైనమిక్ స్కూల్ అవార్డు

బోధనా విధానాల్లో వైవిధ్యానికి జాతీయ గుర్తింపు.. సిబ్బంది అంకితభావంతోనే అవార్డు సాధ్యమైందన్న యాజమాన్యం

📰 Generate e-Paper Clip

మంచిర్యాల, అక్టోబర్ 8 ( ఆంజనేయులు న్యూస్ )

హైదరాబాద్‌లో జరిగిన సౌత్ ఇండియా ఎడ్యుకేషన్ సమ్మిట్–2026లో మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని విద్యా భారతి హైస్కూల్కు జాతీయ స్థాయి డైనమిక్ స్కూల్ అవార్డు లభించింది. బోధనా విధానాల్లో వైవిధ్యం, వినూత్న ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల యాజమాన్యం చేస్తున్న కృషికి ఈ అవార్డు గుర్తింపుగా నిలిచింది. గ్రామీణ ప్రాంతంలోనూ విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో విద్యా భారతి హైస్కూల్ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జీ న్యూస్ నెట్‌వర్క్ సీఈఓ అనిల్ శర్మ చేతుల మీదుగా పాఠశాల ప్రతినిధులు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ తమ పాఠశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఎంతో గర్వకారణమన్నారు. సంస్థ చైర్మన్ ఆగమారావు మాట్లాడుతూ.. పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది అంకితభావం, సమష్టి కృషి ఫలితంగానే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తూ మరింత ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు తమ సంస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అవార్డు సాధనకు కృషి చేసిన సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ సౌమ్య రావు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.