విద్యా భారతి హైస్కూల్కు జాతీయ స్థాయి డైనమిక్ స్కూల్ అవార్డు
మంచిర్యాల, అక్టోబర్ 8 ( ఆంజనేయులు న్యూస్ ) హైదరాబాద్‌లో జరిగిన సౌత్ ఇండియా ఎడ్యుకేషన్ సమ్మిట్–2026లో మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని విద్యా భారతి హైస్కూల్కు జాతీయ స్థాయి డైనమిక్ స్కూల్ అవార్డు లభించింది. బోధనా విధానాల్లో వైవిధ్యం, వినూత్న ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల యాజమాన్యం చేస్తున్న కృషికి ఈ అవార్డు గుర్తింపుగా నిలిచింది. గ్రామీణ ప్రాంతంలోనూ విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో విద్యా భారతి హైస్కూల్ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. బుధవారం...