Saturday, August 29, 2026
HomeTelanganaసోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్

సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్

ఆపదలో అండగా.. కష్టాల్లో తోడుగా నిలిచే బంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీక

📰 Generate e-Paper Clip

మంచిర్యాల ఆగస్టు 28, ( ఆంజనేయులు న్యూస్ )

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, అక్కాతమ్ముళ్ల అనురాగానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ రక్షాబంధన్. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, బాధ్యతలను మరింత బలపరిచే ఈ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి, వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను ఆకాంక్షిస్తారు. సోదరులు తమ సోదరీమణులకు అండగా ఉంటామని, వారి కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తామని భరోసా ఇస్తారు. రక్త సంబంధాలకు అతీతంగా ప్రేమ, ఆప్యాయతలను పంచే గొప్ప బంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తోంది. ఏ ఆపద వచ్చినా.. ఎలాంటి కష్టం ఎదురైనా.. ఒకరికి ఒకరు తోడుగా నిలిచే సోదర సోదరీమణులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.