Monday, August 17, 2026
HomeTelangana“న్యాయం చేస్తా” అంటూ నమ్మించి మోసం.. వివాహితను గర్భవతిని చేసిన సీఐ!

“న్యాయం చేస్తా” అంటూ నమ్మించి మోసం.. వివాహితను గర్భవతిని చేసిన సీఐ!

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, ఖమ్మం జిల్లా: జిల్లాలో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ వివాహితకు న్యాయం చేస్తానని నమ్మించిన సీఐ బానోత్ రాజు నాయక్, ఆమెను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. అప్పట్లో మహిళా పోలీస్ స్టేషన్‌లో సీఐగా పనిచేసిన రాజు నాయక్, తన సమస్య పరిష్కరిస్తానంటూ దగ్గరయ్యాడు. అనంతరం ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడని తెలిపింది. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడంతో పెళ్లి విషయంపై ప్రశ్నించగా, బలవంతంగా టాబ్లెట్లు మింగించి అబార్షన్ చేయించాడని ఆరోపించింది. ఈ నెల 7న బాధితురాలు అధికారులకు ఫిర్యాదు చేయగా, విచారణలో ఆరోపణలకు సంబంధించిన ప్రాథమిక నిజాలు బయటపడినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారులు సీఐ రాజు నాయక్‌ను హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.