Monday, August 17, 2026
HomeTelanganaమంచిర్యాలకే వరం… నరాల వ్యాధులకు సంజీవని – డా|| తిరుమల్ రావు

మంచిర్యాలకే వరం… నరాల వ్యాధులకు సంజీవని – డా|| తిరుమల్ రావు

📰 Generate e-Paper Clip

• రోగులకు ఉపశమనం – ప్రజల మన్ననలు పొందుతున్న న్యూరాలజిస్ట్

• నరాల వ్యాధులతో బాధపడుతున్న వందలాది మందికి కొత్త జీవితం

• “వైద్యో నారాయణ హరి” అన్నదానికి నిదర్శనం డాక్టర్ తిరుమల్ రావు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో నరాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు దేవుడి వరంలా మారిన న్యూరాలజిస్ట్ డా|| బి. తిరుమల్ రావు. “వైద్యో నారాయణ హరి” అన్న మాటను తన వైద్య సేవలతో అక్షరాలా నిజం చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. M.D. (జనరల్ మెడిసిన్), D.M. (న్యూరాలజీ – ఉస్మానియా) వంటి అత్యున్నత అర్హతలు కలిగిన డా|| తిరుమల్ రావు, ఆధునిక వైద్య విధానాలతో నరాల వ్యాధులకు ఖచ్చితమైన చికిత్స అందిస్తున్నారు. స్ట్రోక్ (పక్షవాతం), మూర్చ వ్యాధి, మైగ్రేన్ తలనొప్పులు, నరాల బలహీనత, చేతులు–కాళ్లలో మంటలు, పార్కిన్సన్స్ వంటి క్లిష్ట సమస్యలతో బాధపడుతున్న అనేక మంది ఆయన వైద్యం ద్వారా కోలుకుంటున్నట్లు రోగులు వెల్లడిస్తున్నారు.
ప్రతి రోగిని వ్యక్తిగతంగా పరిశీలించి, అవసరమైన పరీక్షలు నిర్వహించి, వ్యాధి మూలాన్ని గుర్తించి చికిత్స చేయడం ఆయన ప్రత్యేకత. రోగులకు వ్యాధిపై పూర్తి అవగాహన కల్పిస్తూ, నమ్మకంతో కూడిన వైద్య సేవలు అందిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోనే నిపుణ న్యూరాలజిస్ట్ అందుబాటులో ఉండటంతో, దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు కూడా పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మెరుగైన చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రజల సమయం, ధనం ఆదా అవుతుండటంతో పాటు, ఆరోగ్య పరిరక్షణకు మరింత భరోసా లభిస్తోంది.
డా|| తిరుమల్ రావు వైద్య సేవలతో అనేక కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. నరాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఆశా కిరణంగా నిలుస్తున్న ఆయన, నిజంగా మంచిర్యాల జిల్లా ప్రజలకు వరం అని చెప్పవచ్చు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.