Monday, August 17, 2026
HomeTelanganaఆశయంతో పోరాటం.. సేవతో పాలన.. పల్లపు గంగరాజు

ఆశయంతో పోరాటం.. సేవతో పాలన.. పల్లపు గంగరాజు

📰 Generate e-Paper Clip

ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి.. మీ నమ్మకాన్ని వృథా చేయను.

క్యాతనపల్లి మున్సిపాలిటీ 01వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి పల్లపు గంగరాజు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సేవే లక్ష్యంగా, అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వస్తున్న మంచిర్యాల జిల్లా, క్యాతనపల్లి మున్సిపాలిటీ 01వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి పల్లపు గంగరాజు ప్రజల హృదయాలను ఆకట్టుకుంటున్నారు. ఆశతో కాకుండా ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చానని, వార్డు అభివృద్ధికే తన జీవితాన్ని అంకితం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. “ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి.. మీ నమ్మకాన్ని వృథా చేయను. మీ ఇంటి చిన్నకొడుకులా భావించి ఆశీర్వదిస్తే, మీ సమస్యలకే నా శక్తినంతా వినియోగిస్తాను. ప్రతి వీధి, ప్రతి కాలనీ, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తాను” అని గంగరాజు పేర్కొన్నారు. వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, శుభ్రమైన పరిసరాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. బ్యాటు గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాలని, సేవాభిలాషి నాయకుడిగా తనకు అవకాశం కల్పించాలని ఆయన ప్రజలను కోరారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.